మళ్ళీ ఆర్థిక మాంద్యం?

మళ్ళీ ఆర్థిక మాంద్యం?

అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశముందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన సుమారు 20,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి అమెరికా పెంచింది. దీనికి ప్రతికారంగా చైనా ఎలాంటి సుంకాలు విధించరాదని, తమ విధానాలకు తలొగ్గాలని ట్రంప్‌ ఇవాళ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌ చేసిన  కొన్ని గంటలకు సుమారు 9000 కోట్ల డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై సుంకాన్ని విధించనున్నట్లు చైనా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదని నిర్ణయించింది. ఇప్పిటికే సోయాబీన్‌ అమ్ముడుబోక... అమెరికా రైతులు రుణాలు కట్టలేక దివాళా తీస్తున్నారు. తాజాగా రెండు వేశాల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి సరిపోదన్నట్లు మరో 30,000 కోట్ల విలువైన చైనా వస్తువులపై తాజాగా సుంకం విధించేందుకు అమెరికా సిద్ధమౌతోంది. చైనా నుంచి ప్రతిఘటన ఉండదని భావించిన అమెరికాకు ఇవాళ్టి చర్యతో కంగుతింది.