సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం

సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. సెక్షన్‌-50లోని క్లాజ్‌3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని లంచ్‌మోషన్‌లో పిటిషనర్‌ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్‌-15 క్లాజ్‌ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కావున ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. వాదనల అనంతరం విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.