ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసి మృతి

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసి మృతి

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్ వాసి అర్జున్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన అర్జున్‌ రెడ్డిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన సామ అర్జున్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య మహేశ్వరి, కుమార్తె ఇషిక ఉన్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసిన మాట్లాడిన అర్జున్‌.. మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు. అర్జున్ రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లి. మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని అర్జున్ రెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు.