ఎన్టీఆర్ తో సందీప్ వంగ సినిమా..!!

ఎన్టీఆర్ తో సందీప్ వంగ సినిమా..!!

టెంపర్ సినిమా నుంచి వరసగా హిట్స్ కొడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత సినిమాతో మరో రికార్డును సాధించాడు.  కెరీర్లోనే అత్యధిక గ్రాస్ ను సాధించిన సినిమాగా అరవింద నిలిచింది.  ఇప్పుడు ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.  ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.  

ఇదిలా ఉంటె, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ లోనే స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ .. ఎన్టీఆర్ కోసం ఓ కథను రెడీ చేశారట.  అది లవ్ స్టోరీ.  ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.  ఎన్టీఆర్ ను మాస్ హీరోగా చూడాలని అనుకుంటారు.  అందుకే ఎన్టీఆర్ ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు.  మొదటి నుంచి ఇలాంటి సినిమాలే చేస్తున్నారు.  యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్.. ఇవే ఎక్కువగా ఉంటాయి.  లవ్ స్టోరీతో చేసిన సినిమాలు చాలా తక్కువ.  ఇప్పుడు ఆ లోటును సందీప్ రెడ్డి భర్తీ చేయాలని చూస్తున్నాడు.  

ఇటీవలే ఎన్టీఆర్ ను కలిసి సందీప్ రెడ్డి లైన్ చెప్పగా.. పూర్తి కథతో రమ్మని చెప్పినట్ట్టు తెలుస్తోంది.  ప్రసుత్తం సందీప్ రెడ్డి బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిని రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.  ఆ సినిమా పూర్తవ్వగానే ఎన్టీఆర్ కథను రెడీ చేసే పనిలో ఉంటారని సమాచారం.