హిందీ పరిశ్రమను దున్నేస్తున్న 'అర్జున్ రెడ్డి'

హిందీ పరిశ్రమను దున్నేస్తున్న 'అర్జున్ రెడ్డి'

తెలుగు హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి' హిందీలో 'కబీర్ సింగ్' పేరుతొ రీమేక్ అయిన సంగతి తెలిసిందే.  దేన్నీ కూడా సందీప్ వంగ డైరెక్ట్ చేశారు.  విడుదలైన మొదటి రోజు నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.  షాహిద్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.  బీ టౌన్ ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఈ చిత్రం 180 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.  ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ మొత్తం 200 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి.