అర్జున్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్... ఎప్పుడంటే...!!

అర్జున్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్... ఎప్పుడంటే...!!

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు.  ఈ సినిమాతో విజయ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఈ క్రేజ్ ఎలా పనిచేసిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమా తరువాత విజయ్ గీతగోవిందం సినిమా చేశారు.  ఇది భారీ విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.  అయితే, ఆ తరువాత చేసిన సినిమాలు వరసగా ఫెయిల్ కావడంతో పాపం విజయ్ పరిస్థితి అయోమయంలో పడింది.  

రీసెంట్ గా రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా దెబ్బకొట్టింది.  ప్రస్తుతం పూరి తో సినిమా చేస్తున్నారు.  అయితే, అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేయాలని విజయ్ ఆశపడుతున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హిందీలో అర్జున్ రెడ్డి సినిమా తీసి హిట్ కొట్టాడు.  రణవీర్ సింగ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా, రణ్వీర్ బిజీ కావడంతో ఇప్పట్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా లేదు.  అసలైన క్రైమ్ కథతో సినిమా చేస్తానని సవాల్ చేశారు.  ఇప్పుడు ఆ కథతో పాన్ ఇండియా లెవెల్లో విజయ్ తో తీసేందుకు వంగ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  ఈ కాంబినేషన్లో సినిమా అంటే చెప్పాల్సిన అవసరం లేదు.