నిఖిల్ సినిమా మళ్ళీ వెనక్కి !

నిఖిల్ సినిమా మళ్ళీ వెనక్కి !

నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' చిత్రం ఇప్పటికే పలుసార్లు వాయిదాపడి చివరకు మే 1వ తేదీన విడుదలకు సిద్ధమైంది.  కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారింది.  కారణం రేపు 26వ తేదీన 'అవెంజర్స్ ఎండ్ గేమ్' విడుదలవుతోంది.  భారీ క్రేజ్ నడుమ వస్తున్న ఈ చిత్రానికి పోటీగా సినిమా రిలీజ్ చేస్తే వసూళ్లు తప్పకుండా దెబ్బతింటాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భావించాయి.  అందుకే సినిమాను మే రెండవ సగానికి  వాయిదావేయాలని నిర్ణయించారు.  హీరో నిఖిల్ ఈ విషయాన్నే చెబుతూ డిస్ట్రిబ్యూటర్ల కోసం సినిమాను వాయిదావేస్తున్నామని, ఇంతలా ఎదురుచూసేలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలని అన్నారు.