అర్జున్‌కు రవిశాస్త్రి సలహాలు

అర్జున్‌కు రవిశాస్త్రి సలహాలు

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్రికెట్ పాఠాలు, సలహాలు ఇచ్చారు. అర్జున్‌ టెండూల్కర్‌ శ్రీలంకతో జరగబోయే అండర్‌-19 భారత జట్టులో స్థానం పొందిన విషయం తెలిసిందే. అండర్‌-19 కోసం అర్జున్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో శిక్షణ  పొందుతున్నాడు. ఐర్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు కూడా లండన్‌లో ఉంది. సోమవారం భారత జట్టును కలిసిన అర్జున్ టెండూల్కర్‌ భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి నుంచి విలువైన సలహాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఐర్లాండ్‌తో జరిగే టీ-20 సిరీస్‌ కోసం టీమిండియా శనివారం లండన్‌లో దిగింది. అక్కడ్నుంచి బయల్దేరి డబ్లిన్‌కు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది.