వేలానికి జూనియర్‌ టెండూల్కర్‌..!

వేలానికి జూనియర్‌ టెండూల్కర్‌..!

ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ సీనియర్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. టీ20 ముంబై లీగ్‌లో ఆడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఆటగాళ్ల వేలంతో తన పేరును నమోదు చేయించాడు. ఇప్పటికే ఇండియా అండర్‌-19 జట్టుకు రెండు టెస్టులు ఆడిన జూనియర్‌ టెండూల్కర్‌.. ముంబై అండర్ -23 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు.  లెఫ్టామ్‌ పేసర్‌ అయిన అర్జున్‌.. ఇటీవలే తన బౌలింగ్‌ యాక్షన్‌ను సవరించుకున్నాడు.