ఐపీఎల్‌ ఎంట్రీపై స్పందించిన అర్జున్‌ టెండూల్కర్‌

ఐపీఎల్‌ ఎంట్రీపై స్పందించిన అర్జున్‌ టెండూల్కర్‌

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వారసుడు అర్జున్‌ టెండూల్కర్‌ను ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో ఆఖరిగా వేలానికి వచ్చి అమ్ముడుపోయిన ప్లేయర్‌ అర్జున్‌ టెండూల్కరే. అయితే.. అర్జున్‌ ఐపీఎల్‌ రంగ ప్రవేశంపై సోషల్‌ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇది ఇలా ఉండగా... ఐపీఎల్‌ ఎంట్రీపై అర్జున్‌ టెండూల్కర్‌ స్పందిచాడు. ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో జాయిన్‌ అవ్వడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని అన్నాడు అర్జున్‌ టెండూల్కర్‌. ఐపీఎల్ ప్రారంభం నుంచి తాను ముంబై ఇండియన్స్‌కు వీరాభిమానినన్న అతడు... తనను నమ్మి జట్టులోకి తీసుకున్న జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముంబై టీం జెర్సీ ధరించేందుకు ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నానని అర్జున్‌ టెండూల్కర్‌ చెప్పాడు.