'వరల్డ్‌కప్‌లో మా ఓటమి ఖాయం'

'వరల్డ్‌కప్‌లో మా ఓటమి ఖాయం'

'శ్రీలంక క్రికెట్ బోర్డులో అవినీతి పెరిగిపోయింది. ఆటగాళ్లలోనూ నైతికత దెబ్బతింది. ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోట్లాడుకుంటున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడేందుకే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. దేశం సంగతి పక్కనపెట్టేస్తున్నారు. ఇవన్నీ చూస్తే.. వరల్డ్‌ కప్‌లో మా జట్టు మొదటి రౌండ్‌లోనే ఓడిపోవడం ఖాయం' అని అభిప్రాయపడ్డారు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ అర్జున్ రణతుంగ. జట్టులోని కీ ప్లేయర్స్‌ను మానసికంగా బలవంతులుగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాడు. లసిత్ మలింగ, థిసారీ పెరీరా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్‌ చేసుకున్న నేపథ్యంలో రణతుంగా ఈ వ్యాఖ్యలు చేశారు.