ఆర్మూర్ లో రైతుల మహాధర్నా

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి జాతీయ రహదారిపై పసుపు, ఎర్రజొన్న రైతులు మహాధర్నా చేస్తున్నారు. ధర్నా ప్రాంతానికి వివిధ గ్రామాల రైతులు చేరుకుంటున్నారు. పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడిపల్లి చౌరస్తాకు పోలీసులు భారీగా చేరుకుని 144 సెక్షన్ విధించారు. ధర్నా కారణంగా పోలీసులు ట్రాఫిక్ ను దారిమళ్లిస్తున్నారు.

మరోవైపు నిజామాబాద్-నిర్మల్, నిజామాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. మామిడిపల్లి చౌరస్తాలోని 63వ జాతీయ రహదారిపై రైతులు వంటావార్పు చేపట్టారు. జాతీయ రహదారిపైకి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే.. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామానికి ఇద్దరు చొప్పున ఎంపీ అభ్యర్ధులుగా నామినేషన్ వేస్తామని రైతులు హెచ్చరించారు.