ధోనీకి ఆర్మీ గుడ్ న్యూస్

 ధోనీకి ఆర్మీ గుడ్ న్యూస్

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అభ్యర్థనకు ఆర్మీ ఉన్నతాధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్న ధోనీ..  వెస్టిండీస్‌ పర్యటనకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ శిక్షణ తీసుకుంటానని భారత ఆర్మీ ఉన్నతాధికారులను ధోనీ అభ్యర్థించాడు. 
ధోనీ అభ్యర్థనకు ఓకే చెప్పామని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. ఈక్రమంలో ప్యారాచూట్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో రెండు నెలలపాటు ధోనీ శిక్షణ తీసుకుంటాడు. కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో ఈ శిక్షణ కొనసాగనుంది. సైనిక శిక్షణ తీసుకున్నప్పటికీ ధోనీ.. ఎటువంటి సైనిక చర్యల్లో భాగం కాలేడని అధికారులు స్పష్టం చేశారు.