క్వారంటైన్ సెంట‌ర్‌లో ఆర్మీ జ‌వాన్ల ఆందోళ‌న‌

క్వారంటైన్ సెంట‌ర్‌లో ఆర్మీ జ‌వాన్ల ఆందోళ‌న‌

క‌రోనావైర‌స్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు.. బోర్డ‌ర్‌లో ఉన్న జ‌వాన్ అయినా.. కుగ్రామంలో ఉన్న రైతు అయినా.. దీని బారిన‌ప‌డుతున్నారు.. అయితే.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో దీని తీవ్ర‌త ఉండ‌గా... క్ర‌మంగా ప‌ల్లెల‌కు కూడా పాకుతోంది. ఇక‌, ఇప్ప‌టికే ఆర్మీ జ‌వాన్లు సైతం పెద్ద సంఖ్య‌లో ఈ మాయ‌దారి వైర‌స్ బారిన‌ప‌డ్డారు..  కాగా, ఆర్మీ జ‌వాన్లు క్వారంటైన్ సెంట‌ర్‌లో ఆందోళ‌న‌కు దిగిన ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలో జ‌రిగింది.. వివ‌రాల్లోకి వెళ్తే.. నెల రోజుల సెలవుపై వ‌చ్చిన జ‌వాన్ల‌కు క‌రోనా టెస్టుల అనంతరం క్వారంటైన్‌కు త‌ర‌లించారు అధికారులు.. ఆ టెస్ట్‌ల‌కు సంబంధించిన రిపోర్టులు రాగానే ఇంటికి పంపిస్తామ‌ని చెప్పి.. సంతబొమ్మాళి మండంలం లక్ష్మీపురం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు.. అయితే.. వారం రోజులు గ‌డిచినా రిపోర్టులు రాలేద‌ని చెబుతున్నారు అధికారులు.. దీంతో.. ల‌క్ష్మీపురం క్వారంటైన్ కేంద్రం ద‌గ్గ‌ర 80 మంది ఆర్మీ జ‌వాన్లు ఆదోళ‌న‌కు దిగారు.. వారం రోజులు గ‌డిచినా విష‌యం చెప్ప‌క‌పోవ‌డం.. ఇంటికి పంప‌క‌పోవ‌డంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.. క‌నీస వసతి లేద‌ని.. భోజనం సరిగా లేదంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు ఆర్మీ జ‌వాన్లు.