నెలరోజుల్లో ఆర్మీ మేజర్ పెళ్లి.. ఇంతలోనే..

నెలరోజుల్లో ఆర్మీ మేజర్ పెళ్లి.. ఇంతలోనే..

రాజౌరీ జిల్లాలో ఐఈడీ పేలడంతో చనిపోయిన ఆర్మీ మేజర్ ఛిత్రేష్‌ సింగ్ బిస్త్ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. మరో నెలరోజుల్లో పెళ్లి ఉందనగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పనుల్లో ఉండగా ఛిత్రేష్ మరణవార్త విని కుటుంబీకులు కుప్పకూలిపోయారు. ఆర్మీ మేజర్ ఛిత్రేష్ తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి. 

నౌషేరా సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంట భారత ఆర్మీ బృందం శనివారం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఓ ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేసిన సైన్యం, మరో ఐఈడీని నిర్విర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈఘటనలో 31 ఏళ్ల ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌కు మేజర్‌ ఛిత్రేష్ సింగ్ బిస్త్ కు మార్చి 8న వివాహం జరగాల్సి ఉంది.