పూంఛ్ లో పేలుడు..ఒక జవానుకి గాయాలు

పూంఛ్ లో పేలుడు..ఒక జవానుకి గాయాలు

జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర సోమవారం ఒక మందుపాతర పేలిన ఘటనలో సైన్యానికి చెందిన ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సరిహద్దు రేఖ దగ్గర గస్తీ కాస్తుండగా మేంఢర్ సెక్టర్ లో ఒక మందుపాతర పేలినట్టు సైనికాధికారులు తెలిపారు. గాయపడిన సైనికుడిని హుటాహుటిన సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు.