పెద్దపల్లి జిల్లాలో కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి..

పెద్దపల్లి జిల్లాలో కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి..

పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. జిల్లాలోని శాయంపేటలో కాల్పులు జరిపారు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి తిరుమల్ రెడ్డి... దీంతో తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు... సమాచారం అందుకున్న డీసీపీ రవీందర్.. వెంటనే పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, ఓ వివాహం అనంతరం నిర్వహించిన భరాత్‌లో పాల్గొన్న తిరుమల్ రెడ్డి.. గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... తిరుమల్ రెడ్డికి ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు ఇచ్చారు? కాల్పులు జరపడానికి గల కారణాలపై దృష్టిసారించారు.