ప్రారంభమైన 'ఆరోగ్య రక్ష' కిట్ల పంపిణి

ప్రారంభమైన  'ఆరోగ్య రక్ష' కిట్ల పంపిణి

ప్రభుత్వ పాఠశాల్లోని బాలికల ఆరోగ్యం కోసం ప్రవేశ పెట్టిన ఆరోగ్య రక్ష కిట్ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ జిల్లా హసన్ పర్తిలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాల్లో స్ధానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొని బాలికలకు ఉచితంగా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణి చేశారు. మొత్తం 13 రకాలకు చెందిన 21 వస్తువులు ఈ కిట్ లో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఆరోగ్య రక్ష కిట్ల పేరుతో ప్రతి బాలికపై ఏడాదికి రూ. 1,600 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ను గణనీయంగా తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడంతో పాటు బాలికల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.