రాజస్థాన్‌లో ఘోర విషాదం..

రాజస్థాన్‌లో ఘోర విషాదం..

రాజస్థాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. గుడారాలు కూలడంతో 14 మంది మరణించారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాడ్‌మేర్‌ జిల్లాలోఏర్పాటు చేసిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఈ గుడారాలు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం గాలితోపాటు భారీ వర్షం కురవడంతో ఈ గుడారాలు కుప్పకూలాయి. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.