శశిధరూర్ కి అరెస్ట్ వారెంట్ !

శశిధరూర్ కి అరెస్ట్ వారెంట్ !

కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కు కోల్‌కతాలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బిజెపి అధికారం చేపడితే, భారత్‌ ను హిందూ పాకిస్థాన్‌ గా మారుస్తుందంటూ థరూర్‌ గతేడాది జులైలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సమిత్‌ చౌదరి అనే న్యాయవాది కోల్‌కతా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శశి థరూర్‌ కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. గత ఏడాది జూలైలో తిరువనంతపురం ఎంపీగా ఉన్న శశిథరూర్ ఒక ప్రసంగంలో ప్రసంగిస్తూ, 2019 లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తే హిందూ పాకిస్థాన్ ఏర్పాటు దిశగా పరిస్థితులు మారుతాయని అన్నారు.

పాకిస్థాన్ రాజ్యాంగం తరహాలో కొత్త రాజ్యాంగాన్ని బీజేపీ రచిస్తుందని ఆ రాజ్యాంగం ప్రకారం మైనారిటీల హక్కులకు ఎలాంటి గౌరవం ఉండబోదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అవసరం లేని, నచ్చని అంశాలన్నింటినీ రాజ్యాంగం నుంచి తొలగిస్తారని వారికి నచ్చినట్టు మార్చివేస్తారని పేర్కొన్నారు. హిందూ సిద్ధాంతాలను రాజ్యాంగంలో పెడతారని దీంతో, దేశంలోని మైనార్టీలు సమాన హక్కులను కోల్పోతారని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అజాద్ వంటి మహనీయులు ఇలాంటి పరిస్థితి కోసం స్వాతంత్ర్య పోరాటం చేయలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఆయన అప్పట్లో లైట్ తీసుకున్నారు. కానీ కోర్టులో కేసు వేయడంతో ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.