ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ లపై అరెస్ట్ వారంట్!!

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ లపై అరెస్ట్ వారంట్!!

మహారాష్ట్రలోని ఒక కోర్టు మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. శివసేన పార్టీ అధికార పత్రిక 'సామ్నా'లో 2016లో ప్రచురించిన కార్టూన్ పై మరాఠా వర్గ నేతలు పెట్టిన కేసులో కోర్టు ఈ వారంట్ ఇచ్చింది. శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్, కార్టూనిస్ట్ శ్రీనివాస్ ప్రభుదేశాయ్ లపై కూడా వారంట్ జారీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఉన్న పుసాద్ కోర్ట్ ఈ వారంట్లు జారీ చేసింది.

సెప్టెంబర్ 2016లో ఈ వివాదాస్పద కార్టూన్ ప్రచురితమైంది. మరాఠా ఆందోళనకారులు చేపట్టిన మూక్ మోర్చా (మౌన ప్రదర్శన)ను కార్టూన్ లో మూకా మోర్చా (ముద్దుల ప్రదర్శన)గా ఎద్దేవా చేశారు.