రామ్ చరణ్ సినిమాకు డీవోపీ కష్టాలు..!!

రామ్ చరణ్ సినిమాకు డీవోపీ కష్టాలు..!!

రామ్ చరణ్.. బోయపాటి సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను దీపావళికి రిలీజ్ చేయాలని యూనిట్ ఇప్పటికే నిర్ణయించింది.  ఈ లుక్ కోసం యూనిట్ కష్టపడుతున్న సంగతి తెలిసిందే.  హైవోల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాటోగ్రాఫర్ మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. సినిమా చిక్కుల్లోపడింది.  రిషి పంజాబీ ఎందుకు సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు అనే దానిపై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. 

ఇప్పుడు రిషి స్థానంలో ఆర్ధర్ విల్సన్ వచ్చాడు.  ఆర్ధర్ విల్సన్ గతంలో సింహ, దమ్ము, పవర్,  కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, ఇటీవలే వచ్చిన సాక్ష్యం సినిమాలకు పనిచేశారు సింహ, దమ్ము వంటి బోయపాటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది.  మరి రామ్ చరణ్ సినిమాకు ఎలాంటి ఫొటోగ్రఫీ అందిస్తాడో చూడాలి.