కొత్త టెక్నాలజీ..! మాస్క్‌లేకుండా రోడ్డెక్కితే అంతే..!
కరోనా లాక్డౌన్ నిబంధనలు తుంగలో తొక్కి బయటకి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. వీరిపై పోలీసులు నిఘా పెట్టి వాహనాలు సీజ్ చేస్తూనే ఉన్నారు.. ఇక, లాక్డౌన్ 3.0 అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్లపై మరింత రద్దీ పెరిగింది.. అయితే, మాస్క్ ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసినా.. చాలా మంది ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. మాస్క్ లేకుండా బయటకి వస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తోంది.. మొదట రూ.500 ఉన్న ఈ ఫైన్.. తర్వాత రూ. వెయ్యికి పెంచారు.. అయినా.. అక్కడక్కడ మాస్క్‌లు లేకుండా రోడ్లపై కనిపిస్తూనే ఉన్నారు ప్రజలు.. అయితే, దీనిని మరింత పటిష్టం అమలు చేసేందుకు పూనుకుంటున్నారు తెలంగాణ స్టేట్ పోలీసులు.. దేశంలోనే తొలిసారి అత్యుధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీరికి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది.. కొత్త టెక్నాలజీ, సీసీటీవీ నిఘా కెమెరాల యొక్క కంప్యూటర్ విజన్‌ను (#DeepLearningTechnique) లోతుగా విశ్లేషించడం అనే కృత్రిమ మేధో పద్ధతిని ఉపయోగించబోబుతన్నారు. ఈ టెక్నాలజీ (#AI)ద్వారా ఫేస్ మాస్క్ ధరించని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకునే దిశగా... తెలంగాణ స్టేట్ పోలీసు అడుగులు వేస్తోంది.. (#FaceMaskViolationEnforcement) అతి త్వరలోనే తెలంగాణలో అమలు చేయబోతున్నారు. అంటే.. మాస్క్ లేకున్నా సరి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నామని అనుకుంటే మీరో ఎక్కడో ఒక్కదగ్గర దొరికిపోవడం ఖాయం.. జేబుకు చిల్లు పడడం పక్కా.. అందుకే.. మాయదారి కరోనా బారిన పడకుండా.. ఫైన్‌ను కట్టకుండా తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే సరి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)