ఇందిరా గాంధీ హత్య తరహాలో నన్ను...

ఇందిరా గాంధీ హత్య తరహాలో నన్ను...

బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన తరహాలోనే తనను కూడా అంతమొందించడానికి కుట్ర పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు బీజేపీ తనను హత్య చేయిస్తుందని ఆరోపించారు. బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగిన తరహాలోనే తన హత్యకు కూడా కుట్ర జరుగుతుందన్న అనుమానాలను కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. ఇందిరను సొంత భద్రతా సిబ్బంది హత్యచేశారని.. తనను కూడా అలాగే హత్య చేయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రచారం నిర్వహిస్తుండగా కేజ్రీవాల్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. మోతీనగర్లో ఓపెన్‌టాప్‌ జీపులో కేజ్రీవాల్‌ పర్యటిస్తుండగా ఎర్రరంగు టీషర్టు ధరించిన అగంతకుడు ఆప్‌ కార్యకర్తలందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది.