రౌడీ బేబీ అంటోన్న కొత్తజంట..!!!

రౌడీ బేబీ అంటోన్న కొత్తజంట..!!!

కొత్త జంట అనగానే అల్లు శిరీష్ సినిమా అనుకుంటున్నారా.. అదేం కాదండి.. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య.. అఖిల్ హీరోయిన్ సాయేషాలు గజినీకాంత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు.  ఆ ప్రేమ పెళ్ళివైపు అడుగులు వేసింది.  రీసెంట్ గా హైదరాబాద్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.  ఈ వివాహానికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు.  

వివాహం సమయంలో కొత్త జంట డ్యాన్స్ చేస్తూ జోష్ ను పెంచారు.  ధనుష్ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ లో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టారు.  ఇలా డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వీడియోను కోలీవుడ్, టాలీవుడ్ ఫాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ... కొత్త జంటకు విషెష్ చెప్తున్నారు.