ఆర్య.. సయేషా పెళ్లికానుక ఇదే..!!

ఆర్య.. సయేషా పెళ్లికానుక ఇదే..!!

కోలీవుడ్ హీరో ఆర్య.. హీరోయిన్ సయేషాలు ప్రేమించుకొని ఈనెల 10 వ తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఫలక్ నామా ప్యాలస్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.  సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలామంది ఈ వివాహానికి హాజరయ్యారు.  వీరిద్దరూ కలిసి గజినీకాంత్ సినిమా చేశారు.  ఆ సమయంలోనే ప్రేమలో పడటం.. వీరి పెళ్ళికి రెండు కుటుంబాల వారు ఆమోదించడం.. పెళ్లి జరగడం అన్ని చెకచెకా అయ్యాయి.  

సూర్య హీరోగా చేస్తున్న కాప్పన్ సినిమాలో ఆర్య, సయేషాలు నటిస్తున్నారు.  అంతేకాదు, వివాహం ముందురోజు వీరిద్దరి కాంబినేషన్లో టెడ్డి అనే మూవీను అనౌన్స్ చేశారు.  టిక్ టిక్ టిక్ దర్శకుడు శక్తి సుందర్ రాజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  మే నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.