టీఆర్‌ఎస్‌లోకి ఆర్యవైశ్య కమ్యూనిటీ అధ్యక్షుడు

టీఆర్‌ఎస్‌లోకి ఆర్యవైశ్య కమ్యూనిటీ అధ్యక్షుడు

ఆర్యవైశ్య కమ్యూనిటీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌కు వైశ్యుల మీద ప్రత్యేక అభిమానం ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో వ్యవసాయం గాడిన పడుతున్నదన్నారు.