టెండర్స్‌కు ఆహ్వానించిన బీసీసీఐ.. ఎందుకోసం అంటే..?

టెండర్స్‌కు ఆహ్వానించిన బీసీసీఐ.. ఎందుకోసం అంటే..?

అవుట్గోయింగ్ స్పాన్సర్ నైక్ స్థానంలో జట్టు కిట్ స్పాన్సర్ మరియు అధికారిక మర్చండైజింగ్ భాగస్వామి హక్కుల కోసం భారత క్రికెట్ బోర్డు సోమవారం టెండర్స్‌కు ఆహ్వానించింది. జట్టు ప్రస్తుత దుస్తులు స్పాన్సర్షిప్ రైట్స్ ఉన్న నైక్ ఒప్పందం వచ్చే నెలతో ముగియనుంది. నైక్ ఇంతక ముందు 370 కోట్లకు బీసీసీఐతో నాలుగేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రస్తుతం టెండర్స్‌కు వచ్చిన వారిలో గెలిచిన బిడ్డర్ జట్టుకు కిట్ స్పాన్సర్ మరియు అధికారిక మర్చండైజింగ్ తో పాటుగా ఇతర అనుబంధ హక్కులు ఇవ్వబడుతాయి. ఆటగాళ్ళు ఐపీఎల్ కోసం యూఏఈ కి బయలుదేరేముందు వరకు అంటే ఆగస్టు 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎటువంటి కారణం చెప్పకుండానే ఏ దశలోనైనా బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేయడానికి లేదా సవరించడానికి బీసీసీఐ అన్ని హక్కులను కలిగి ఉంది.