మోదీ, షా దమ్ముంటై నాపై పోటీ చేయండి...

మోదీ, షా దమ్ముంటై నాపై పోటీ చేయండి...

దమ్ముంటే రండి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాకు సవాల్ విసిరారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎం 60వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... హైదరాబాద్‌ లోక్‌సభ నుంచి ఎంఐఎంపై పోరాటానికి ఎవరైనా రండి... మోడీ అయినా, అమిత్‌షా అయినా, కాంగ్రెస్ నేతలైనా అని సవాల్ చేశారు ఒవైసీ. ఇక ఆ రెండు పార్టీలో కలిసి పోటీచేసినా విజయం సాధించలేరని జోస్యం చెప్పారాయన. 2019 బదులు ముందే జనరల్ ఎలక్షన్స్ నిర్వహించాలని చూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వాళ్ల నాలుగేళ్ల పాలనలో అందిరికీ నిరాశ తప్ప... చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఒవైసీ.