ప్రచారంలో అదిరే చిందేసిన అసద్...చూశారా?

ప్రచారంలో అదిరే చిందేసిన అసద్...చూశారా?

కొందరు లీడర్ల మాటల చాలా సీరియస్ గా ఉంటాయి. వాళ్లు మాట్లాడుతున్నారంటే.. ఏదో ముఖ్యమైన విషయం చెబుతున్నారనే అనుకుంటాం. అలాంటి సీరియస్ ఇమేజ్ ఉన్న నేత్లలో ఒకరు ఎం.ఐ.ఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఓవైసీ మాట తూటాల పేలుతుంది. అలాంటి ఒవైసీ డాన్స్ చేశారంటే నమ్మగలమా ? అదీ.. ఓ పబ్లిక్ మీటింగ్‌ సందర్భంగా, నమ్మలేం కదా కానీ ఓవైసీ సాబ్ స్పెప్పులేశారు, యమస్పీడ్ గా  డాన్స్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా  ఎం.ఐ.ఎం చీఫ్ ముచ్చటైన డాన్సై చూసే అదృష్టం ఆయన ఫ్యాన్స్ కు దక్కింది. 'మియా భాయ్' పాటకు డ్యాన్స్ చేయడంతో సభకు హాజరైనవారు కేరింతలు కొట్టారు. మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి.  ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా చూసెయ్యండి మరి