కమల్ వ్యాఖ్యలను సమర్ధించిన అసదుద్దీన్

కమల్  వ్యాఖ్యలను సమర్ధించిన అసదుద్దీన్

జాతిపితపై మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమర్ధించారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్‌ గాడ్సే అంటూ కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహాత్మా గాంధీ హంతకుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. హిందూ ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మా గాంధీని చంపింది ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తద్వారా నాథూరామ్‌ గాడ్సే గురించి కమల్‌ వెలిబుచ్చిన అభిప్రాయానికి ఆయన మద్దతునిచ్చారు.