రజనీకాంత్ ని టార్గెట్ చేసిన ఒవైసీ 

రజనీకాంత్ ని టార్గెట్ చేసిన ఒవైసీ 

ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ విభజనపై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. రాజ్యాంగ విరుద్ధంగా లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన అసద్ పనిలో పనిగా సూపర్ స్టార్ రజనీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ విభజన,అర్ధికల్ 370 రద్దు విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరిని ఎంఐఎం పార్టీ తప్పు పట్టింది. లోకసభలో రాజ్యాంగ విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో వ్యవహరించిందని విమర్శించారు ఓవైసి. సూపర్ స్టార్ రజనీకాంత్ పై కూడా అసద్ మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోడీ- అమిత్ షా కృష్ణార్జునుల్లా వ్యవహరించారని తలైవా ప్రశంసించడాన్ని తప్పుపట్టారు. అయితే ఇక్కడ పాండవులు, కౌరవులు ఎవరు ? దేశంలో మరో మహాభారతం కావాలని మీరు కావాలనుకుంటున్నారా అని రజనీకాంత్ ను నిలదీశారు. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తూ.. వెూదీ ప్రభుత్వం చారిత్రక తప్పిదానికి పాల్పడిందన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఒవైసీ పేర్కొన్నారు.