ఐపీఎల్ ఇప్పుడు కాదు అక్టోబర్ లో అంటున్న నెహ్రా...

ఐపీఎల్ ఇప్పుడు కాదు అక్టోబర్ లో అంటున్న నెహ్రా...

భారత్ లో కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యం లో ఐపీఎల్ ఇప్పుడు నిర్వహించడం కష్టం అక్టోబర్ లో అయితే ఐపీఎల్ కు ఎటువంటి అడ్డంకులు ఉండవని  భారత మాజీ ఫాస్ట్ బౌలర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బౌలింగ్ కోచ్ "ఆశిష్ నెహ్రా" చెప్పాడు. అయితే కరోనా వైరస్ కారణంగా గత నెల 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఈ నెల 15 వరకు వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే మన దేశం లో ఇంకా కరోనా ప్రభావం తగ్గకపోవడం తో అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ వెలువడుతున్నాయి. అయితే మళ్ళీ ఈమధ్య బీసీసీఐ ఐపీఎల్ ను ఆగస్టు-సెప్టెంబరులో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పై స్పందించిన నెహ్రా బీసీసీఐ కు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఒకవేళ ఐపీఎల్ ను ఆగస్టు లో నిర్వహించాలనుకుంటే వద్దు ఎందుకంటే ఆ నెలలో మన దేశం లో అధికంగా వర్షాలు పడుతాయి కాబట్టి చాల మ్యాచ్లను వరుణుడు అడ్డుకుంటాడు. అందువల్ల ఐపీఎల్ ను అక్టోబర్ లో నిర్వహిస్తే అప్పటివరకు ఈ కరోనా ప్రభావం తో పాటుగా వరుణుడు అడ్డంకి కూడా తొలగిపోతుంది అని నెహ్రా తెలిపాడు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.