తెలుగు భాషకు స్పూర్తి దివంగత నేత ఎన్టీఆర్

తెలుగు భాషకు స్పూర్తి దివంగత నేత ఎన్టీఆర్

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టిఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు. ఈ సందర్భంగా  అశోక్ గజపతిరాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు.  ఎందరో  ప్రముఖులు నడయాడిన నేల విజయనగరమని.. అందులో గురజాడ అప్పారావు ఒకరన్నారు.  ప్రధాని మోడీ కూడా గురజాడ  యొక్క గొప్పతనాన్ని తెలియజేసారని.. తెలుగు భాష కు స్పూర్తి దివంగత నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.  ప్రస్తుతం తెలుగు  భాషను మరిచిపోయే పరిస్థితి ఉందని... అంబేద్కర్  రచించిన రాజ్యాంగ విలువులను కాపాడాలన్నారు.  అన్నగారు ముఖ్యమంత్రి అయ్యే వరకు  రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాలేదని.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని తెలిపారు.  రాజకీయాల్లో సిద్ధాంతాలు అమలు చేసే విధంగా కృషి చేయాలని.. ఆయనతో పాటు పని చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.  ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఎందులో తక్కువ లేదని నిరూపిస్తున్నారని... అన్న గారి కీర్తిని భావి తరాలకు అందించేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.