విశ్వాసపరీక్షలో నెగ్గిన గెహ్లాట్ సర్కార్... 

విశ్వాసపరీక్షలో నెగ్గిన గెహ్లాట్ సర్కార్... 

ఎట్టకేలకు రాజస్థాన్ లో గెహ్లాట్ సర్కార్ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడింది.  ముఖ్యమంత్రిని ఎదిరించి బయటకు వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  మొదటిరోజునే ప్రతిపక్ష పార్టీ బీజేపీ గెహ్లాట్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.  ఈ తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపి బలపరీక్ష నిర్వహించారు.  ఈ పరీక్షలో గెహ్లాట్ సర్కార్ మూజువాణి ఓటుతో గట్టెక్కింది.  అవిశ్వాస తీర్మానం, బలనిరూపణ పూర్తైన వెంటనే అసెంబ్లీని ఈనెల 21 వరకు వాయిదా వేశారు.