విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చిన అశ్విన్...

విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చిన అశ్విన్...

తాను టీమిండియా తరఫున ఆడతానని ఎప్పుడూ ఊహించలేదన్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. అనుకోకుండా క్రికెటర్‌ అయ్యానని చెప్పుకొచ్చాడు. భారత్‌ తరఫున ఆడటం అదృష్టంగా భావిస్తున్నాని అన్నాడు. మొతేరాలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో అశ్విన్‌ 400 టెస్టు వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే మొతెరా పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండడంపై అశ్విన్‌ అసహనం వ్యక్తం చేశాడు. అసలు మంచి పిచ్‌ అంటే ఏమిటి? పిచ్‌ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలని ప్రశ్నించారు. ప్రారంభంలో పేస్‌కు అనుకూలించి.. ఆపై బ్యాటింగ్‌కు స్పిన్‌కు బాగుండాలా అని విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చారు. పిచ్‌లపై ఇకనైనా చర్చ ఆపాలని సూచించారు. తాము విదేశాల్లో ఆడినప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడమా అని గుర్తు చేశారు అశ్విన్‌.