అశ్విన్ నయా రికార్డు.. కుంబ్లే రికార్డు బ్రేక్..

అశ్విన్ నయా రికార్డు.. కుంబ్లే రికార్డు బ్రేక్..

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు.. టెస్ట్ కెరీర్‌లో వేగంగా 250 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.. కేవలం 42 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు అశ్విన్.. దీంతో శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డును సమం చేయగా.. 43 టెస్టుల్లో 250 వికెట్లు తీసిన కుంబ్లే రికార్డును అదిగమించాడు. ఇండోర్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో మొదటి రోజు భోజన విరామం తర్వాత.. కొద్దిసేపటికే మొమినుల్ హక్‌ను 37 పరుగుల దగ్గర పెవిలియన్‌కు చేర్చిన అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఇక టెస్ట్‌క్రికెట్‌లో ఇప్పటి వరకు వేగంగా 250 వికెట్లు తీసినవారి క్లబ్‌లో 42 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన మురళీధరన్, అశ్విన్ సమంగా ఉండగా.. 43 ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే ఈ రికార్డు సృష్టించాడు. 44 ఇన్నింగ్స్‌ల్లో రంగనా హెరాత్, 49 ఇన్నింగ్స్‌ల్లో డేల్ స్టెయిన్, 51 ఇన్నింగ్స్‌ల్లో హర్భజన సింగ్ ఈ ఫీట్ సాధించారు.