స్టార్క్ ను చూసి నేర్చుకో అశ్విన్ అంటున్న అభిమానులు...

స్టార్క్ ను చూసి నేర్చుకో అశ్విన్ అంటున్న అభిమానులు...

ప్రముఖ స్పిన్నర్ అశ్విన్ ‌ను ఐపీఎల్ 2020 లో తాను మన్కడింగ్ చేయనివ్వనని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పినప్పటినుండి మొదలైన మన్కడింగ్ వివాదం అసలు ఆగడం లేదు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ సమయం లో జరిగిన ఓ ఘటన తర్వాత అభిమానులు చాలామంది అశ్విన్ ను ట్రోల్ చేస్తున్నారు. నిన్న ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి వన్డే లో ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్ చేస్తున్న సమయం లో నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న ఆదిల్‌ రషీద్ బంతి వేయకముందే క్రీజు దాటేశాడు. అయితే అక్కడ స్టార్క్‌ రషీద్ హెచ్చరించాడే తప్ప మన్కడింగ్‌ చేయలేదు. ఈ  ఘటనకు సంబంధించిన ఫోటోను ఓ అభిమాని ట్విట్టర్ లో అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ... ''ఆట అంటే ఇది. చూసి నేర్చుకో'' అని పోస్ట్ చేసాడు. దానికి సమాధానంగా ''నేను బాగానే ఆడుతాను, కానీ కాస్త వేచి చూడాలి, భవిష్యత్తులో ఇందుకు సమాధానము చెప్తాను'' అని అశ్విన్ తెలిపాడు. అయితే గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ను మన్కడింగ్ చేసాడు. దాని పై ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో చర్చ మొదలయ్యింది.