చైనీయుల పై అశ్విన్ అసహనం... ఎందుకంటే..?

చైనీయుల పై అశ్విన్ అసహనం... ఎందుకంటే..?

భారత దేశాన్ని మాత్రమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తుంది కరోనా. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 6000 మంది వరకు ప్రాణాలు కోల్పోగా సుమారు 1.50 లక్షల మంది దీని బారిన పడ్డారు. చాల కంపెనీలు వర్క్ ఫ్రొం హోమ్ తోనే నడిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా అని విద్య సంస్థలకు సెలవులు ప్రకటించాయి. అయితే ఈ వైరస్ కారణంగా ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. ఆదివారం కూడా ఎవరు బయటికి రావడం లేదు. అయితే, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం చెన్నైలో మాత్రం ఇలా జరగలేదని అన్నారు. వేసవి కాలం కావడంతో కరోనావైరస్ ముప్పు తగ్గుతుందని చెన్నై ప్రజలు నమ్ముతారని లేదా వారు ఈ సమస్యను అంత తీవ్రంగా  పరిగణించడం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం పై తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసాడు అందులో..."సామాజిక స్పృహ చెన్నైలోని ప్రజల దృష్టిని ఇంకా ఆకర్షించినట్లు అనిపించడం లేదు. వేసవిలో ఇది తగ్గిపోతుందని వారు అనుకుంటున్నారు లేదా ఏమీ జరగదు అనే నమ్మకం మాత్రమే వారు ఇలా చేయడానికి కారణం కావచ్చు" అని అన్నారు.