భారత్ విజయానికి ఆసీస్ కెప్టెన్ టిమ్ ‌పైన్‌ ఓ కారణం : అశ్విన్‌

భారత్ విజయానికి ఆసీస్ కెప్టెన్ టిమ్ ‌పైన్‌ ఓ కారణం : అశ్విన్‌

ఇటీవల టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘన విజయానికి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ కూడా ఓ కారణమని రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి సెటైర్లు వేశాడు. అశ్విన్‌ తాజాగా టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్.శ్రీధర్‌తో చిట్ చాట్ చేసాడు. యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా మరోసారి టిమ్‌పైన్‌పై అశ్విన్‌ సెటైర్లు విసిరాడు. గబ్బా టెస్టులో అతడు చేసిన తప్పిదాలతో భారత్‌ గెలిచిందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ను స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని పైన్‌ వదిలేశాడు. దాంతో నేనతడిని ఇష్టపడటం మొదలెట్టాను. మమ్మల్ని గబ్బాకు రమ్మని పిలిచాడు.. తీరా వెళితే అక్కడ స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని వదిలేశాడు. అలా అతడే మాకు సిరీస్‌ను కట్టబెట్టాడు. అని అశ్విన్‌ సరదాగా వివరించాడు.