ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌‌ను ట్రోల్ చేసిన అశ్విన్...

ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌‌ను ట్రోల్ చేసిన అశ్విన్...

ఆసీస్ పై భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సిరీస్ కోల్పోయి ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌‌ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు. గబ్బాలో భారత్ విజయాన్ని సందర్భంగా పైన్‌ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్ ఆడకపోయినా.. సిడ్నీ టెస్ట్‌లో అసాధారణ పోరాటం చేశాడు. హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకర బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఓవైపు వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్నా.. జట్టు కోసం నిలబడ్డాడు. ఈ క్రమంలో అశ్విన్‌పై పైన్ నోరుపారేసుకున్నాడు.. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దీనికి తనదైన శైలిలో అప్పుడు ‘మేము కూడా మిమ్మల్ని భారత్​లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. నీకు అదే చివరి సిరీస్​ కావొచ్చు.'అని బదులిచ్చాడు. ఈ స్లెడ్జింగ్‌ను ఉదేశిస్తూ తాజా విజయానంతరం చురకలంటించాడు. ‘గుడ్ ఈవ్‌నింగ్ గబ్బా!! ఈ మైదానం నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్‌ను ఎప్పటికీ మరిచిపోలేం'అని పెయిన్ కు అలాగే క్రికెట్ ఆస్ట్రేలియాకు ట్వీట్ ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.