అశ్విన్‌ వెరైటీ బౌలింగ్‌ చూశారా...?

అశ్విన్‌ వెరైటీ బౌలింగ్‌ చూశారా...?

మొన్నామధ్య ఐపీఎల్‌లో మన్కడింగ్‌ చేసి తీవ్ర విమర్శలపాలైన స్పిన్నర్‌ రవిచంద్ర అశ్విన్‌ మరోసారి రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. అదేదో కొత్త ట్రిక్‌ అన్నట్టుగా వెరైటీగా బౌలింగ్‌ చేసి విమర్శలపాలయ్యాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నిన్న దిందిగల్‌ డ్రాగన్స్‌(డీడీ)తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు తలపడింది. గిల్లీస్‌ టీమ్‌పై డ్రాగన్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. చివరి రెండు బాల్స్‌లో గిల్లీస్‌ 17 పరుగులు చేయాల్సిన తరుణంలో బౌలింగ్‌ చేసిన అశ్విన్‌.. విచిత్రంగా బంతిని విసిరాడు. రాంగ్‌ ఫుట్‌తో బౌలింగ్‌ చేసిన అశ్విన్‌పై సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. విజయం కోసం అడ్డదారులు తొక్కడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇక.. ఈ టోర్నీలో దిందిగల్‌ డ్రాగన్స్‌(డీడీ)కు అశ్విన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.