రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా

భారత్ తో జరుగుతున్న ఆసియా కప్‌ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను కోల్పోయింది. 23.5 ఓవర్లో స్పిన్నర్ చాహల్ ఇమ్రుల్ కాయెస్(2)ను అవుట్ చేసాడు. అంతకుముందు కేదార్ జాదవ్ ఓపెనర్ మెహిదీ హసన్(32)ను అవుట్ చేసాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం బంగ్లా 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో దాస్(92), ముష్ఫికర్ రహీం(4)లు ఉన్నారు. భారత బౌలర్లలో చాహల్, జాదవ్ తలో వికెట్ తీశారు.