ధోని చెప్పాడనే ట్రోఫీని అందుకున్నా

ధోని చెప్పాడనే ట్రోఫీని అందుకున్నా

క్రికెట్ లో ట్రోఫీ గెలిచిన అనంతరం కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ కప్‌ను పట్టుకుని ఫొటోలు దిగుతుంటారు. కానీ ఎంఎస్‌ ధోని కెప్టెన్‌ అయ్యాక ఈ సంస్కృతిని పూర్తిగా మార్చాడు. ధోనీ సారథ్యంలో ట్రోఫీ గెలిచిన అనంతరం జట్టులోని సబ్యులు కప్ అందుకుని ఫొటోలు దిగడం చాలానే చూసాం. ధోనీ ముఖ్యంగా జట్టులోని కొత్త కుర్రాళ్లకు కప్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంటాడు. తాజాగా టీమిండియా ఆసియా కప్ గెలిచిన అనంతరం ధోనీ.. రోహిత్ శర్మకు చెప్పి కప్ ను ఖలీల్‌ అహ్మద్ కు ఇప్పించాడు. ఇదే విషయాన్ని ఖలీల్‌ అహ్మద్ తెలిపాడు.

'కప్ గెలిచిన అనంతరం రోహిత్‌కు చెప్పి ధోని నాకు ట్రోఫీ అందించాడు. ఇదే నాకు మొదటి సిరీస్‌, జట్టులో అందరి కంటే నేనే జూనియర్‌ కాబట్టి ట్రోఫీ నా చేతికి ఇప్పించాడు. అది నాకు ఒక మధురమైన అనుభూతి. ట్రోఫీ నాకిచ్చినపుడు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఆ సమయంలో బావోద్వేగానికి గురయ్యా.. అది ఎప్పటికీ మర్చిపోలేను' అని ఖలీల్‌ తెలిపాడు.