మహిళల కబడ్డీ.. ఫైనల్లో ఓటమి
ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ క్రీడాకారిణిలు అంచనాలను అందుకోలేకపోయారు. శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు 24-27 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో భారత మహిళలు రజతంతో సరిపెట్టుకున్నారు. రెండవ అర్ధభాగం హోరాహోరీగా సాగినా చివరకు ఇరాన్ మహిళలు పైచేయి సాధించారు. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరాన్ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల పురుషుల జట్ల ఆటగాళ్లు హాజరై తమ తమ జట్లకు మద్దతునిచ్చారు.
భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన ఆసియా క్రీడల్లో రెండు సార్లు విజేత భారతే. 2012, 2013, 2014లో కబడ్డీ ప్రపంచకప్ ను కూడా భారత మహిళల జట్టు గెలిచింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)