క్వార్టర్స్‌లో బాక్సర్‌ 'పవిత్ర'

క్వార్టర్స్‌లో బాక్సర్‌ 'పవిత్ర'

ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మహిళల విభాగం 60 కిలోల బౌట్‌లో బాక్సర్‌ పవిత్ర(31) విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. పాకిస్థాన్‌ బాక్సర్‌ రుక్సానా పర్వీన్‌ను 10-8 స్కోరుతో ఓడించి ఆసియా క్రీడల్లో తన సత్తా చాటింది. పవిత్ర తొలి రౌండ్‌లోనే రుక్సానాను రెండు సార్లు నాక్‌డౌన్‌ చేసింది. దీంతో రిఫరీ విజయంను ప్రకటించాడు. ఇంతకుముందు పవిత్ర ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచింది. ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్లో ఆమె బంగారు పతకం సాధించింది.