అసంతృప్తులకు బాబు పిలుపు..

అసంతృప్తులకు బాబు పిలుపు..

ఓ వైపు టికెట్ల గోల.. మరోవైపు అసంతృప్తుల బెడద.. ఇంకోవైపు రాజీనామాల పర్వం. ఇవన్నీ ఈ సారి ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల్లోనూ ఇదే గొడవ. ఈక్రమంలో టీడీపీ అసంతృప్తులను బుజ్జగించేందుకు చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. అసంతృప్తులను అమరావతికి రమ్మని పిలిపించారు. టికెట్లు ఆశించి భంగపడ్డ అరవింద్ కుమార్ గౌడ్, శోభారాణిలతోపాటు మరికొందరిని ఆయన అమరావతికి పిలిపించారు. ఏ పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వలేకపోయిందీ వారికి చంద్రబాబు వివరించనున్నారు.