గువాహటీలో గ్రనేడ్ పేలుడు, ఆరుగురికి గాయాలు

గువాహటీలో గ్రనేడ్ పేలుడు, ఆరుగురికి గాయాలు

ఇవాళ రాత్రి 8 గంటలకు అస్సాం రాజధాని గువాహటీలో గ్రనేడ్ పేలుడు భయాందోళనలు రేపింది. జూ రోడ్ లో ఉన్న గువాహటీ సెంట్రల్ మాల్ బయట గ్రనేడ్ పేలుడులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత సంఘటనా స్థలం దగ్గర పోలీసులు రాకపోకలు నిలిపేశారు. పేలుడులో గాయపడినవారిని గువాహటీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. 


గువాహటీ పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ గ్రనేడ్ పేలుడు వివరాలు అందజేశారు. నగరంలో జూ రోడ్ లో రాత్రి 8 గంటలకు గ్రనేడ్ పేలుడు జరిగినట్టు చెప్పారు. ఇందులో ఆరుగురు గాయపడ్డారు. మాల్ బయట జరిగిన పేలుడుపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫా-ఐ ఈ పేలుడు తమ పనేనని ప్రకటించుకొంది. ఈ పేలుడు వెనక కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సొనోవాల్ డీజీపీని ఆదేశించారు.