నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకూ సమావేశాలు జరుగుతాయి. శని, ఆదివారం మినహా మొత్తం 14 పనిదినాలపాటు శాసనసభ జరగనుంది. సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను రేపు ప్రవేశపెడతారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు. ఇవాళ తొలిరోజున రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ, కరవు పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన, చర్చ ఉంటుంది.

ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో చర్చించే అంశాలు..  

  • రాష్ట్రంలో శిథిలావస్థలో రోడ్లు.. ఎర్ర చందనం అక్రమ రవాణ.
  • ఎచ్చెర్ల నియోజకవర్గంలో పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగావకాశాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి.
  • రాళ్లపాడు రిజర్వాయర్ కిందనున్న రైకుల పరిస్థితి, విశాఖ డివిజన్ పరిధిలోని ఐటీడీఏలకు నిధుల కేటాయింపు.
  • విద్యా హక్కు అమలు, రాష్ట్ర రుణ స్థితి.
  • అవయవాల అక్రమ వ్యాపారం, సామాజిక భద్రత ఫించన్ల పెంపు.

ఇవాళ శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో చర్చించే అంశాలు..  

  • పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూములు, గుట్కా నిషేధం అమలు.
  • గోవిందపురం తాగునీటి పథకం పూర్తి, వ్యవసాయ కమిషన్, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ.
  • వైఎస్సార్ చేయూత, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, చేనేత పరిశ్రమల రక్షణ.
  • ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటు, టీటీడీ ఆభరణాల ఆడిటింగ్.
  • రాష్ట్రంలో విత్తనాల కొరతపై స్వల్ప కాలిక చర్చ.