ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.05 నిమిషాలకు సభ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వంలో ఇవే తొలి సమావేశాలు. మొత్తం 5 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. మొదటి రోజు ఎమ్యెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను అధికారికంగా ఎన్నుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఆయణ్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 15,16 తేదీల్లో సభకు సెలవు. ఈ  17,18న సమావేశాలు జరుగుతాయి. 18న సభ వాయిదా పడుతుంది.